సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
:సిసి రోడ్డు నిర్మాణానికి 15 లక్షల రూపాయల నిధులు మంజూరు.
:మంత్రి, ఎమ్మెల్యే సహకారం మరువలేనిది: హాజీ నాయక్
Mbmtelugunews//కోదాడ, మార్చి 25:మండల పరిధిలోని కూచిపూడి తండా గ్రామ అభివృద్ధిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారం
మరువలేనిదని గ్రామ సర్పంచి బాదావత్ హజీ నాయక్ అన్నారు. బుధవారం 15 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూమాటి వరప్రసాదరెడ్డి పాల్గొని సర్పంచ హాజీ నాయక్ పాలకవర్గం తో కలిసి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పూర్తి సహాయ సహకారాలతో 15 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని ఈ నిధులతో సిసి రోడ్డు నిర్మాణం నకు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. రోడ్ల నిర్మాణం వలన గ్రామంలో రాకపోకలు జరిగి గ్రామం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో గ్రామ పెద్దలు ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యమైన నిర్మాణాలు చేపట్టినట్లయితే ఎక్కువ సంవత్సరాలు వాడుకలో ఉండేటట్లు పనులు పూర్తి చేయాలని తెలిపారు. ముఖ్యంగా గ్రామంలోని ఉన్న రైతులు తమ ట్రాక్టర్లను ఫుల్ వీల్స్ తో రోడ్లపై నడిపినట్లు అయితే రోడ్లు తొందరగా డ్యామేజ్ అవుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామ పెద్దలు ప్రజలకు పాల్గొన్నారు.



