సుభాన్.. సుభాన్.. సుభాన్.. రియల్ హీరో
Mbmtelugunews//ఖమ్మం, సెప్టెంబర్04:ఇప్పుడు ఈ వ్యక్తి పేరే అన్నిచోట్లా వినబడుతుంది..
ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద వరదల్లో చిక్కుకున్న 9 మందిని ఒక్కడే వెళ్ళి కాపాడిన సుభాన్ నువ్వే ఇప్పుడు రియల్ హీరో..అధికారులు,ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది,హెలికాప్టర్లు,మంత్రులు చేయని పనిని సామాన్యుడివి ఒక జేసీబీ డ్రైవర్ వినువ్వు ఒక్కడివే చేశావు.. విపత్తు లో ప్రాణాలను పణంగా పెట్టి ఒక్కడివే వెళ్ళి తొమ్మిది మందిని కాపాడావు నిజంగా నువ్వే నిజమైన హీరో..
నీలాంటి మనుషులు సమాజానికి చాలా అవసరం..
ఖమ్మం ప్రజలు నిన్ను ఎప్పటికి మర్చిపోరు..
పోతే ఒక్కడిని పోతా వస్తే వాళ్ళతో పదిమందిమి వస్తాం అంటూ నువ్ అన్నటువంటి మాటలు అందరికీ స్ఫూర్తి..
చిమ్మ చీకట్లో కబళించే ఆ పెను వరద ముప్పులో పడి వెళ్ళి ఆ 9 మంది ప్రాణాలకు దిక్చూచి అయ్యావ్..
వారి కుటుంబాలకు దేవుడివయ్యావ్..
ప్రజలందరికీ ఆదర్శమయ్యావ్..
నువ్ నిజమైన హరో.