సుమన్ చేతుల మీదుగా బ్లాక్ బెల్ట్ ఫిఫ్త్ డాన్ సర్టిఫికెట్ అందుకున్న సూర్య
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 07(ప్రతినిధి మాతంగి సురేష్): ఖమ్మం లో సుమన్ షోటో ఖాన్ కరాటే అకాడమీ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి 30 వ నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా సుమన్ పాల్గొని సుమన్ చేతుల మీదుగా ఛాంపియన్స్ కి బెల్ట్ అవార్డ్స్ అండ్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది.

దీనికి గాను కుందూరు సూర్య బెల్ట్ (బ్లాక్ బెల్ట్ 5 డాన్) సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. అలాగే సూర్య కరాటే కోచింగ్ సెంటర్ విద్యార్ధులు అయినటువంటి రూపక్, సాజిద్ కట్ట విభాగం నందు 3, 4 ప్లేస్ లను దక్కించుకోవడం జరిగింది.



