సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ రిజిస్టర్ ని సస్పెండ్ చేయాలి : ఓయూ జెఏసి చైర్మన్ సోంపంగి పంగి అఖిల్.
Mbmtelugunews//హైదరాబాద్, అక్టోబర్ 30 (ప్రతినిధి మాతంగి సురేష్)-: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ఉపకులపతి నిత్యానందరావు సమక్షంలో దళిత బహుజన విద్యార్థులపై వివక్ష చూపిస్తున్న రిజిస్టర్ ను సస్పెండ్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ సోంపంగి అఖిల్ డిమాండ్ చేశారు.ఓ దళిత బహుజన విద్యార్థికి ఫెలోషిప్ విడుదలైన సంతకం విషయంపై సంభాషణ జరుగుతుండగా విసి ముందే పక్కనే కూర్చొని ఉన్న రిజిస్టర్ ప్రొఫెసర్ కోట్ల హనుమంతరావు మీకు సంతకం పెట్టడం దండగా దండగ అని చెప్పడంతో పాటు ఆగ్రహానికి లోనై అసభ్య పదా జలంతో ప్రవర్తించారని అన్నారు. అక్కడితో ఆగని రిజిస్టర్ మీ సంగతి చూస్తా అంటూ వైస్ ఛాన్స్లర్ ఉన్న సైతం లెక్కచేయకుండా బయటికి వెళ్లిపోయారు. కావున విద్యార్థులను కులం, వర్గాల పేరుతో దూషిస్తూ అదేవిధంగా విద్యార్థుల ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి చూస్తున్న వైస్ ఛాన్స్లర్ ను సైతం గౌరవం ఇవ్వని రిజిస్టర్ కోట్ల హనుమంతరావును రిజిస్టర్ పదవి నుండి తొలగించాలని, లేని పక్షంలో యూనివర్సిటీ లో ఉన్న బహుజన విద్యార్థులందరినీ ఐక్యం చేసి రిజిస్టర్ ను సస్పెండ్ చేసే వరకు ఉద్యమిస్తామని తెలిపారు.



