Tuesday, December 24, 2024
[t4b-ticker]

సూర్యాపేట్ జిల్లాలో విద్యుత్ శాఖకు భారీ నష్టం – సీఎండీ ముషారఫ్ ఫరూఖీ,ఐఏఎస్

- Advertisment -spot_img

సూర్యాపేట్ జిల్లాలో విద్యుత్ శాఖకు భారీ నష్టం – సీఎండీ ముషారఫ్ ఫరూఖీ,ఐఏఎస్

:2127 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

:319 ట్రాన్స్ ఫార్మర్లు చెడిపోయాయి.

:నాలుగు సబ్ స్టేషన్లు ముంపుకు గురయ్యాయి.

:యుద్ధప్రాతిపదికన సరఫరా పునరుద్ధరణ.

Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 04:భారీ వర్షం కారణంగా రాష్ట్రంలోనే అత్యధికంగా సూర్యాపేట్ జిల్లాలోని విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యింది.ఈ నేపథ్యంలో ఈ రోజు,బుధవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ,ఐఏఎస్ కోదాడలో వరద ప్రభావంతో దెబ్బతిన్న రామాపురం క్రాస్ రోడ్డు (నల్లబండగూడెం)సబ్ స్టేషన్లను, కూచిపూడి,తొగరాయి,కోదాడ ఇండోర్ సబ్ స్టేషన్,ఇతర విద్యుత్ నెట్వర్క్ ను పరిశీలించారు.ఈదురు గాలుల ప్రభావంతో చెట్లు,కొమ్మలు విరిగి విద్యుత్ స్తంభాలపై పడటంతో 15 33 కేవీ పోల్స్,1074 11 కేవీ పోల్స్,1038 ఎల్టి పోల్స్,319 ట్రాన్స్ ఫార్మర్స్ దెబ్బతిన్నాయి.

దీనికి తోడు నాలుగు సబ్ స్టేషన్స్ వరద ముంపుకు గురయ్యాయి.ఇంతగా భారీ నష్టం జరిగినా,యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం కోసం తమ సిబ్బంది,అధికారులు అహర్నిశలు కృషి చేసారని కొనియాడారు.ఈ పర్యటనలో సీఎండీతో పాటు చీఫ్ ఇంజినీర్ రూరల్ జోన్ పి బిక్షపతి,సూపెరింటెండింగ్ ఇంజినీర్ ఫ్రాంక్లిన్,డివిజనల్ ఇంజినీర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular