సూర్యాపేట రూరల్(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు): మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శి ఒక ప్రకటనలో ప్రబుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నాడు కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫెర్ వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న వైష్ణవి ,పార్టీ విశేషాలను వీడియో కాల్ ద్వారా తల్లితో సంతోషంగా చెప్పింది.ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి 9:30 ప్రాంతంలో విద్యార్థులంతా బయట కూర్చుని కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో రూముకు వెళ్ళిన వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. వైష్ణవి ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కాలేజ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వైష్ణవి తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది వెళ్లిపోయారని, తమ కూతురు మరణం పై అనుమానాలు ఉన్నాయని ,తమ కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి ఇటీవల కాలంలో సంక్షేమ హాస్టల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి స్థానికంగా హాస్టల్ వార్డెన్లు ఉండకపోవడం నిర్వహణ లోపం వలన ఈ ఘటన జరుగుతున్నట్లు తెలుస్తున్నదని తెలియజేశారు.
సూర్యాపేట గురుకులంలో బాలిక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని,.
RELATED ARTICLES