సూర్యాపేట జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
Mbmtelugunews//సూర్యాపేట డిసెంబర్ 31(ప్రతినిధి మాతంగి సురేష్):సూర్యాపేట రెవెన్యూ ఉద్యోగలు తేదీ :30.12.2024 (సోమవారం) రోజున మధ్యానం 3.00 గంటలకు టిజిటిఏ,తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టిజిఆర్ఎస్ఏ) ఆధ్వర్యంలో రెవిన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం బాణాలు రాంరెడ్డి అధ్యక్షతన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్ వి కలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసినారు.ఇట్టి కార్యక్రమానికి అందరు రెవెన్యూ ఉద్యోగులు ఆఫీస్ సభ ఆర్డినేట్ నుండి తహసీల్దార్ వరకు అదేవిదంగా పూర్వ గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) పూర్వ వీఆర్ఏలు హజరైనారు తమ తమ సమస్యలు విన్న వించుకోవడమే కాకుండ ఈ సంవత్సర కాలంలో మనం సాధించుకున్న విజయాలను గుర్తుచేసుకున్నారు.రైతుల కోణంలో భూభారతి-2024 చట్టo ,గ్రామనికో రెవిన్యూ ఉద్యోగి తీసుకోచ్చిన్న తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ సంఘము యొక్క అధ్యక్షులు లచ్చిరెడ్డి కృషిని అభినందించడం జరిగింది. సూర్యాపేట జిల్లా సెక్రెటరీగా గంటేపంగు విక్రమ్ ను ఎన్నుకోవడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్,చైర్మన్ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు వి లచ్చిరెడ్డి,సెక్రటరీ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ నాయకులు రామకృష్ణ,టిజిటిఏ స్టేట్ ప్రెసిడెంట్ ఎస్ రాములు,జనరల్ సెక్రటరీ రమేష్ పాక,సెక్రటరీ జనరల్ పూల్ సింగ్,టిజిఆర్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ బి రాంరెడ్డి,టిజిఆర్ఎస్ఏ స్టేట్ సెక్రటరీ,వి భిక్షం,ఆర్డీవో సూర్యాపేట వేనుమాధవరావు,వివిధ మండలాల తహశీల్దార్లు,డిప్యూటీ తహశీల్దార్లు పాల్గోన్నారు.