సెల్ఫ్ డిఫెన్స్ కోసం మహిళలు కరాటే నేర్చుకోవాలి.
:దెబ్బ ఎవరికైనా తగులుతుంది ప్రతికూల పరిస్థితుల్లో మార్షల్ ఆర్ట్స్ తో మెరుపు దాడి చేయెచ్చు:కిషోర్ గునుకుల
Mbmtelugunews//నెల్లూరు జిల్లా,సెప్టెంబర్ 08:మనుబోలుపాడు,కావలి నియోజకవర్గం లో కరాటే ఫిఫ్త్ డాన్ ఆది ఆధ్వర్యంలో మనుబోలుపాడులో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మహిళలు కరాటే నేర్చుకోవాల్సిన ఆవశ్యకత తెలియజేస్తూ కరాటే విన్యాసాలు,సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,అడ్వకేట్ రమా,సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ రషీద్,కరాటే మాస్టర్ వసంత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ కరాటే గురించి అందరికీ ఉత్సాహం ఉన్న నేర్చుకునేది కొంతమందే,అందునా ఫిఫ్త్ డాన్ వరకు రావడం నిజంగా అభినందనీయం.ఈ రోజుల్లో కూడా దాదాపు 100 మందికి కరాటే శిక్షణ ఇస్తూ ముఖ్యంగా మహిళలు సెల్ఫ్ డిఫెన్స కోసం కరాటే నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను నేర్పిస్తున్న మాస్టర్ ఆది అభినందనీయులు.అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.ఆది ఎన్నోసార్లు ఫోన్ చేసి గ్రామంలో కార్యక్రమానికి రావలసిందిగా కోరారు…ఈ విషయంలో ఆయనకి జనసేన పార్టీ పట్ల ఉన్న ప్రేమ,పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఎంతో కనపడ్డాయి అందుకే దూరమైన కూడా రాత్రి అయినా కూడా ఇక్కడికి వచ్చాను.ప్రస్తుత పరిస్థితుల్లో కరాటే కేవలం శారీరక ధారుడ్యానికే కాదు మానసిక ఉల్లసానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.వసంత్ ని చూస్తే 70 సంవత్సరాలా అనిపిస్తుంది దేహ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే క్రీములు కాదు ఇలా కరాటే లాంటివి నేర్చుకోవాలి అని అందరూ తెలుసుకోవాలి.కరాటే విన్యాసాలలో భాగంగా పెంకులు పగలగొట్టడం చూశానేని కార్ కింద చేతులు పెట్టడం ప్రత్యక్షంగా చూడడం ఇదే.కరాటే వంటి విద్యలను మనం కూడా ప్రోత్సహించాలి దానికి నా వంతుగా నా ప్రయత్నం చేస్తానని తెలిపారు.



