Saturday, December 27, 2025
[t4b-ticker]

:సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:సైబర్ సెక్యూరిటీ డిఎస్పి శ్రీనివాస రావు

కోదాడ,మార్చి 15(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో గల కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ మోసాలు,సైబర్ నేరాలపై జిల్లా సైబర్ సెక్యూరిటీ డిఎస్పి శ్రీనివాస్ రావు విద్యార్థులకు అవగాహన కార్యక్రమమాన్ని నిర్వహించారు.సైబర్ నేరాలకు నివారించడం లో అవగాహన కలిగి యువత,విద్యార్థులు వారి తల్లిదండ్రులను,స్నేహితులను,బంధువులను చైతన్యవంతం చేయాలని సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ డిఎస్పి శ్రీనివాసరావు గారు తెలిపినారు. ఆన్లైన్ లావాదేవీలలోనే ఎన్నో మోసాలు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రతి నిత్యం ఎన్నో రకాల ఫోన్లు,మెసేజ్ ల రూపంలో మోసగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.ఓటిపి నెంబర్లు,ఏటీఎం,డెబిట్ కార్డుల పిన్ నెంబర్లు,బ్యాంక్ అకౌంట్ కు సంబందించిన ముఖ్యమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితులలో ఎవరికి ఇవ్వవద్దని సూచించారు.బ్యాంకులు నిత్యం తమ వినియోగదారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయని అయినప్పటికీ చిన్న చిన్న పొరపాట్లు,అత్యాశ కారణంగా మోసాలకు గురి అవుతున్నారని తెలిపారు.అవగాహన లేకపోవడం, అపరిచితులను గుడ్డిగా నమ్మడమేనని చెప్పారు.పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానంతో సులభంగా డబ్బు సంపాదించడానికి సైబర్ నేరగాళ్లు అనేక రకాల దారుల్లో మోసాలకు పాల్పడుతున్నారని సామాజిక మాధ్యమాల ద్వారా,మెసేజ్ ల రూపంలో,ఫోన్ కాల్స్ రూపంలో మన వివరాలు తెలుసుకొని మన బ్యాంక్ అకౌంట్ల నుండి డబ్బులు లాగేస్తున్నారని అందువల్ల సామాజిక మాధ్యమాలను సైతం ఒక నిర్దిష్టమైన పద్ధతిలోనే వినియోగించాలని సూచించారు.సామాజిక మధ్యమాలలో ముఖ్యమైన ఫేస్ బుక్,ట్విట్టర్,వాట్స్ అప్ లాంటి వాటిలో అపరిచిత వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లోనూ స్నేహం చేయవద్దని అది ఎన్నో రకాల అనార్దలకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు.ఓటిపి లు, పాస్ వర్డులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని, సోషల్ మీడియాలో మహిళలను, విద్యార్థులను వేధించినా,దూషించినా సైబర్ క్రైమ్ కిందికే వస్తుందని తెలిపారు. ఇటీవలి కాలంలో మనకు ఏ మాత్రం సంబంధం లేకుండా సైబర్ నేరగాళ్లు తప్పుడు పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని,అలాంటి వారి బారిన పడకుండా ప్రజలు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ కోరారు. మోసాలపై పిర్యాదు చేయడానికి 1930 టోల్ ఫ్రీ నంబర్, www.cybercrime.gov.in వెబ్ సైట్ నందు పిర్యాదు చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం,సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మినారాయణ,పోలీస్ టెక్నికల్ సిబ్బంది మహేష్,సైదులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular