స్కూటీని తప్పించబోయి అద్భుతప్పి పల్టీ కొట్టిన ట్రాక్టర్
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 20 (ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామ పరిధిలోని తెలంగాణ చెక్ పోస్టు సమీపంలో కారును తప్పించబోయి ముందు ఉన్న స్కూటీకి టక్కరిచ్చి ట్రాక్టర్ పల్టీ కొట్టిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కూచిపూడి గ్రామానికి చెందిన శెట్టి వెంకటనారాయణ కొడుకు శ్రీను ట్రాక్టర్ వేసుకొని కోదాడ వస్తుండగా చెక్ పోస్ట్ సమీపంలో కారును తప్పించబోయి ముందుగా ఉన్న స్కూటీకి టక్కరిచ్చిన సమయంలో ట్రాక్టర్ పల్టీ కొట్టినాదని ఆ క్రమంలో స్కూటీ తోలే అతనికి ట్రాక్టర్ డ్రైవర్ కి తలకి బలమైన గాయాలు అయినట్లు తెలిపారు.స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి నేలకొండపల్లి మండలం కొత్తూరు గ్రామ వాసిగా గుర్తించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.