స్కూల్ బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ లు చేయించుకోవాలి
:బస్సులలో అన్ని సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలి.
:మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని
Mbmtelugunews//కోదాడ,మే 16(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ పరిధిలోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల బస్సులపై అవగాహన కార్యక్రమాన్ని స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి కోదాడ పరిధిలోని స్కూల్స్ ఇన్చార్జిలు,యాజమాన్యాలు పాల్గొన్నారు.అనంతరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని మాట్లాడుతూ స్కూల్ బస్సులకు తప్పనిసరిగా అన్ని కాగితాలు ఉండాలి వాటి ఫిట్నెస్ లు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అన్నారు.స్కూల్ బస్సులో పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు.ఫస్ట్ ఎయిడ్ కిట్టు తప్పనిసరిగా ఉండాలని అన్నారు.సీనియర్ డ్రైవర్లను లైసెన్స్ ఉన్న డ్రైవర్లని బస్సులకి అపాయింట్ చేసుకోవాలని అన్నారు.లేనిపక్షంలో అలాంటి బస్సులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్స్ యాజమాన్యాలు,ఇన్చార్జిలు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.