స్పందించిన భారత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యస్ యస్ రావు.
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 08(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ మండల పరిధిలోని కూచిపూడి గ్రామానికి చెందిన మాదాసు బేబీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిత్యవసరాలు,వంట సామాగ్రి,బట్టలు వర్షానికి కొట్టుకుపోయిన పరిస్థితిని తెలుసుకున్న భారత్ వెల్ఫేర్ అసోసియేషన్,కోదాడ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావు సహృదయంతో స్పందించి కోదాడలోని తన గృహంలో మంగళవారం నాడు బేబీకి నిత్యావసర సరుకులు,బియ్యం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎస్ రావు మాట్లాడుతూ భవిష్యత్తులో బేబీ కుటుంబానికి భారత్ వెల్ఫేర్ అసోసియేషన్ అండగా ఉంటుందని అన్నారు.