స్పోర్ట్స్ స్కూల్స్‌లో 4వ తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు
Mbmtelugunews//చింతలపాలెం, మార్చి 15: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్స్‌లో 4వ తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన విద్యార్థులకు మండల స్థాయి మోటార్ క్వాలిటీ టెస్టులు మార్చి 17న ఉదయం 9 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చింతలపాలెం లో నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి ఎన్. శ్రీనివాస్ తెలిపారు. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 10 మంది బాలురు, 10 మంది బాలికలను జిల్లా స్థాయి ఎంపికలకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న విద్యార్థులు సమయానికి హాజరుకావాలని కోరారు.*



