కోదాడ,జులై 15 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ 2023 సర్వే నిర్వహణ లో భాగంగా అర్పి లు మరియు ఇతర మునిసిపల్ సిబ్బంది కృషి అభినందనీయం అని,ఇప్పటి వరకు 18000 మంది పౌరుల ఫీడ్ బ్యాక్ తో సర్వే నిర్వహణ లో కోదాడ పురపాలక సంఘం ముందంజలో ఉన్నదని,మునిసిపల్ కార్యాలయం లో నిర్వహించిన సమావేశం లో కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ తెలియచేశారు.అలానే ఇంకొంత ఉత్సాహం తో ప్రతి ఒక్కరూ సర్వే నిర్వహిస్తూ కోదాడ పట్టణాన్ని రాష్ట్రం లో మొదటి స్థానం లో చివరివరకు నిలపాలి అని,ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో వీరితో పాటు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,పార వీరయ్య,సిఓ వెంకన్న,భవాని,అర్పిలు సిబ్బంది,మునిసిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షన్ 2023 సర్వే నిర్వహణ లో రాష్ట్రం లో మొదటి స్థానంలో ఉన్న కోదాడ మునిసిపాలిటీ:చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీ నారాయణ
RELATED ARTICLES