కోదాడ,డిసెంబర్ 14(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:స్వయం ఉపాధితో యువత ఆర్థికంగా ఎదగాలి అని టిపిసిసి క్యాంపెనింగ్ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ కేఎల్ఎన్ ప్రసాద్ అన్నారు.గురువారం మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో ప్రోప్రయిటర్లు కాసాని శివకుమార్,కాసాని కొండ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ దగ్గర శివాలయం రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన శివ మెడికల్ జనరల్ స్టోర్స్,త్రివేణి ఎంటర్ప్రైజెస్ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ల ను ఆయన ప్రారంభించినారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఆర్థికంగా ఎదగాలంటే స్వయం ఉపాధి సౌకర్యాలను ఎంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాలేబోయిన పాపారావు,రాజు,కొండ సైదులు,కాసాని వీరబాబు,గురవయ్య,సుబ్బయ్య,కాసాని శ్రీనివాసరావు,కాసాని బ్రహ్మం,చిన్న వీరయ్య,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
స్వయం ఉపాధితో యువత ఆర్థికంగా ఎదగాలి:టిపిసిసి క్యాంపెనింగ్ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ కేఎల్ఎన్ ప్రసాద్
RELATED ARTICLES



