Wednesday, March 4, 2026
[t4b-ticker]

స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: సర్పంచ్ మందుల నాగయ్య

స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: సర్పంచ్ మందుల నాగయ్య

Mbmtelugunews//కోదాడ, మర్చి 03(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో నూతనంగా శాంక్షన్ అయినా స్త్రీశక్తి భవనానికి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుడిబండ గ్రామ సర్పంచ్ మందులు నాగయ్య,మండల అధ్యక్షుడు తుమాటీ వరప్రసాద్ రెడ్డి పాల్గొని భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గుడిబండ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేయడం జరిగింది. పొదుపు సంఘాల మహిళలు ఈ భవనంలో పొదుపు సంఘాల సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటదని అన్నారు. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇర్ల నరసింహ రెడ్డి, ఉపసర్పంచ్ ఈర్ల జై సింహా రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు రఫీ, వార్డ్ మెంబర్లు ప్రేమ్చంద్, వంశీ, పులి గామయ్య, సోమపంగు శ్రీను, సీఎం శ్రీను, మాదాసు నాగరాజు, పులి పున్నయ్య, ఇస్సాకు, రాందాసు, కుక్క డపు సైదులు, కరుణాకర్, జోసెఫ్, దానియేలు, గ్రామంలోని పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular