కోదాడ,జనవరి 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని కాపుగల్లు గ్రామానికి చెందిన చెరుకుపల్లి కిరణ్ స్వేరోస్ నెట్ వర్క్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనట్లు స్వేరోస్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.హైదరాబాద్ లోని స్వేరోస్ కేంద్ర కార్యాలయం లో జరిగిన సమావేశంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించినట్లు ఆయన తెలిపారు.కాపుగల్లు గ్రామంలో పేదకుటుంబంలో జన్మించిన కరణ్.(ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ),బి.ఎడ్ పూర్తి చేనని కరణ్ గతంలో సారా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడంతో అప్పటి ఉమ్మడి నల్గొండ ఎస్పీ వినయ్ జిత్ దుగ్గల్ నుండి ప్రశంసను పొందారు.2014 నుండి స్వేరోస్ నెట్వర్క్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ స్వేరోస్ అనుచర సంఘంలో నిజాయితీగా పని చేయడంతో ఇప్పుడు రాష్ట్ర నెట్ వర్క్ లో కీలక బాధ్యతలు అప్పజెప్పినట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అయినా రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా నియమించిన ప్రవీణ్ కుమార్ కు, సహకరించిన ఎక్స్ క్యూటివ్ చైర్మన్ మామిడాల ప్రవీణ్,కన్వీనర్ బల్గూరి దుర్గయ్య కి,కో ఆర్డినేటర్ శ్రీకాంత్ కి ధన్యవాదాలు తెలిపారు.అక్షరం,ఆరోగ్యం,ఆర్ధకం అనే నినాదంతో ఏర్పాటైన స్వేరోస్ నెట్వర్క్ ను గ్రామ,గ్రామాన విస్తరించడానికి కృషి చేస్తానని తెలిపారు.
స్వేరోస్’ రాష్ట్ర జాయింట్ సెక్రటరిగా చెరుకుపల్లి కిరణ్
RELATED ARTICLES



