హలో మాదిగ చలో హైదరాబాద్ బహిరంగ సభను విజయవంతం చేయాలి:పల్లేటి లక్ష్మణ్ మాదిగ
Mbmtelugunews//హైదరాబాద్,నవంబర్ 11 (ప్రతినిధి మాతంగి సురేష్)ఎమ్మార్పీస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు వివిధ జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీ జిల్లాలో ఉన్న రాష్ట్ర కమిటీ నాయకులు మండల నాయకులు గ్రామ శాఖఅధ్యక్షులు హలో మాదిగ చలో హైదరాబాద్ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని మాదిగలలో చైతన్యం తీసుకురావాలని కోరుచున్నాము. ఈనెల 19నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలలో జరగబోయే బైక్ ర్యాలీ నీ ప్రతి మండలంలో గ్రామాలలో ప్రచారం చేసి మేడి పాపయ్య మాదిగ నాయకత్వాన్ని బలోపేతం చేసి మాదిగల సంక్షేమానికి హక్కులకై మన జాతి కోసం పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైనది.గత ప్రభుత్వం మాదిగల సంక్షేమాన్ని విస్మరిచ్చిందని మనకు తెలుసు వివిధ జిల్లాలలో ఉన్న నాయకులు ఆ జిల్లాలోని సమస్యల పైన మండల గ్రామాలలో ఉన్న సమస్యల పైన అవగాహన ఉండాలి ఎక్కడ ఏ సమస్య ఉందో అక్కడ నోట్ చేసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా మనం పోరాటం చేయాలి మనం చిత్తశుద్ధితో పనిచేస్తే అంతే సక్సెస్ అవుతాము మన జాతి కోసం ఏం చేసామో వెళ్లిన దగ్గర ప్రజలకు వివరించాలి ఈ ర్యాలీలో యువకులను అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా చూడాలి ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఏర్పడి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కానీ మిగతా కులాలు కంటే మనం వెనుకబడి ఉండటానికి కారణం మనం రాజకీయంగా ఎదగకపోవడమే కారణం.ఏ గ్రామాల్లోనే ప్రశ్నలు తలెత్తినప్పుడు వాటిని మనం ఎదుర్కొని సమాధానం సమయస్ఫూర్తిగా ప్రజలకు తెలియజేయాలి ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా పని చేసినప్పటికీ త్వరలో మన రాష్ట్రంలో దీని అమలు చేసే విధంగా మన వాయిస్ ని పెంచాలి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న గారు ఈ అవకాశం మనకు కల్పించారు కాబట్టి దీనిని మన సద్వినియోగం చేసుకొని ఎంతోమంది రాజకీయంగా ఎదగాలని పాపన్న ఆలోచన ఇలాంటి మంచి ప్రోగ్రామ్ తీసుకున్న రాష్ట్ర అధ్యక్షులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ & సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పల్లేటి లక్ష్మణ్ మాదిగ సూర్యాపేట జిల్లా