హాస్టల్ నుండి 4 గురు విద్యార్థుల మిస్సింగ్…
:ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు…
:సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు…
Mbmtelugunews//నిర్మల్ జిల్లా, అక్టోబర్ 25(ప్రతినిధి మాతంగి సురేష్):భైంసా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో మంగళవారం ఉదయం చరణ్ 6 వ తరగతి,రాకేష్ 8వ తరగతి,కేశవ్ 6వ తరగతి,ఈశ్వర్ 5 వ తరగతి అనే 4 గురు విద్యార్థుల మిస్సింగ్ అయ్యారు.ఇది తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.తల్లి తండ్రులకి సమాచారం ఇవ్వడంలో హాస్టల్ వార్డెన్,వాచ్మెన్ నిర్లక్షం వహించారంటూ పేరెంట్స్ వాపోతున్నారు.విద్యార్థుల మధ్య నిన్న రాత్రి గొడువ జరిగినట్లు అక్కడి మరో విద్యార్థి పేర్కొన్నారు.ఏప్పటిలాగే రోజు ప్రొద్దున పిల్లలకి పాలిచ్చే క్రమంలో వాచ్మెన్ గమనించడంతో ఈ ఘటన బయటకు వచ్చిందని వాచ్మెన్ పేర్కొన్నారు.సంఘటన స్థలానికి పట్టణ సీఐ గోపీనాథ్ చేరుకొని తల్లిదండ్రులతో మాట్లాడి హాస్టల్ వార్డెన్ వాచ్మెన్ ద్వారా మరింత సమాచారాన్ని సేకరించే పనిలోపడ్డారు.పిల్లలు ఆచూకీ కోసం పోలీసుల చర్యలు ముమ్మరం చేశారు.