హాస్టల్ లో మెనూ,పరిసరాలు పరిశుభ్రత పాటించకపోతే కఠిన చర్యలు.
:హాస్టల్ బియ్యం లో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదు.
హాస్టల్స్ ను తనిఖీ చేసిన ఆర్డిఓ సూర్యనారాయణ
Mbmtelugunews//కోదాడ,జనవరి 31(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడలో పలు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ లను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డిఓ సూర్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని హాస్టలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలకి అందించాల్సిన మెనూ ప్రకారం భోజనం అందించాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని హెచ్చరించారు. వార్డెన్ లో విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించిన శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హాస్టల్ బియ్యాన్ని పక్క దారి పట్టిస్తే కఠినమైన చర్యలు చేపడతామని తెలిపారు. హాస్టల్లో మౌలిక వసతులను మధ్యాహ్నం భోజన వసతులను పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విక్రమ్,రెవెన్యూ సిబ్బంది హాస్టల్ వార్డెన్లు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.