కోదాడ,జనవరి 03(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:నేడు గురువారం జనవరి 4న ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ లో ఐడిసి ముఖ్య కార్యాలయంలో (మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర) రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్ నందు హుజూర్ నగర్ & కోదాడ నియోజక వర్గాల్లో ప్రస్తుతం ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నిర్వహణ విషయం లో,అవసరం ఉన్న లిఫ్ట్ లకు మరమ్మత్తు విషయాలలో,కొత్త లిఫ్ట్ ల ప్రతి పాదనల పై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి,ఐడిసి ఎండి,సూర్యాపేట జిల్లా చీఫ్ ఇంజనీర్,ఇతర ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించెదరు.ప్రస్తుతం నిర్వహణలో ఉన్న లిఫ్ట్ స్కీమ్ విషయంలో గాని,కొత్తగా ప్రతిపాదించ బోతున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ల విషయం లో గాని హుజూర్ నగర్,కోదాడ నియోజక వర్గాల్లో ప్రజా ప్రతినిదులు ఎవరైనా,రైతులు ఎవరైనా వారి సలహాలు,సూచనలు ఇవ్వదలుచుకుంటే ఈ సమావేశానికి హాజరు కాగలరు.
హుజూర్ నగర్&కోదాడ నియోజకవర్గాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సమీక్ష
RELATED ARTICLES



