Tuesday, January 14, 2025
[t4b-ticker]

హైడ్రా మరో సంచలనం.. అధికారులపై కేసుల నమోదుకు రంగం సిద్ధం

- Advertisment -spot_img

హైడ్రా మరో సంచలనం.. అధికారులపై కేసుల నమోదుకు రంగం సిద్ధం

Mbmtelugunews//హైదరాబాద్,ఆగష్టు 28:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు,చెరువులు,కుంటలు,నాలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా..గవర్నమెంట్ నుండి ఫ్రీ హ్యాండ్ ఉండటంతో జెట్ స్పీడ్ దూసుకెళ్తుంది.తన,మన అనే భేదం లేకుండా అక్రమణ అని తేలితే చాలు యాక్షన్ లోకి దిగి పని పూర్తి చేస్తోంది.గంటల వ్యవధిలో పెద్ద పెద్ద భవంతులను నేలమట్టం చేస్తోంది.హైడ్రా దూకుడుతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.ఎప్పుడు ఎక్కడి నుండి వచ్చి తమ అక్రమ కట్టడాలను నేల మట్టం చేస్తారోనని భయంతో గజగజ వణికిపోతున్నారు.అక్రమణదారులు. హైడ్రా ఏర్పాటైన కొద్ది రోజుల వ్యవధిలోనే తమ
విధానమేంటో స్పష్టం చేసిన హైడ్రా.. సామాన్య ప్రజల నుండి బడా నేతలు,సెలబ్రెటీలకు చెందిన అక్రమ కట్టడాలను కూల్చి పడేసింది.

అయితే,కూల్చివేతల సమయంలో కొన్ని చోట్ల హైడ్రాకు ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. అధికారులు అనుమతి ఇస్తేనే తాము నిర్మించుకున్నామని.. ఇందులో తమ తప్పేముందని హైడ్రా అధికారులను నిలదీస్తున్నారు పలువురు నిర్మాణదారులు.ఈ క్రమంలో హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైడ్రా డిసైడ్ అయినట్లు సమాచారం.మొదటి స్టేజ్ లో భాగంగా ఎఫ్టీఎల్ పరిధిలో కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యిందట హైడ్రా.అనంతరం బఫర్ జోన్లలో నిర్మాణలకు అనుమతులిచ్చిన అధికారుల వివరాలు సేకరించి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసుల నమోదుకు హైడ్రా సిఫార్స్ చేసినట్లు సమాచారం.చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్,హెచ్ఎండీ అసిసెంట్ ప్లానింగ్ ఆఫీసర్,గండిపేట సూపరింటెండెంట్,నిజాంపేట మున్సిపల్ కమిషనర్,సర్వేయర్,నిజాంపేట ఎమ్మార్వోలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్ కి హైడ్రా
సిఫార్స్ చేసినట్లు సమాచారం.ఇప్పటి వరకు అక్రమ కట్టడాలను కూల్చిన హైడ్రా..ఇకపై ఇల్లీగల్ కన్ స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధం కావడంతో సంబంధిత శాఖ అధికారుల్లో దడ మొదలైంది..

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular