Monday, December 23, 2024
[t4b-ticker]

హైదరాబాది పార్టీలను తరిమి వేద్దాం. ఆంధ్రుల అభివృద్ధిని సాధిద్దాం,2024 ఎన్నికల తీర్పు ఆంధ్రుల భవిష్యత్ కు హైదరాబాది నేతల దోపిడీకి.,హైదరాబాద్ లో గల విభజన ఆస్తుల వాటాను తక్షణమే ఆంధ్రప్రదేశ్ కు అప్పగించాలి .

- Advertisment -spot_img

*ఆంధ్రప్రదేశ్(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) రాజమండ్రి గతించిన ఆంధ్రుల పౌరుషన్ని తిరిగి గర్జించాల్సిందే *

పునర్వీభజన చట్టంపై పార్లమెంట్ లో పునర్ చర్చ జరపాలి .

విభజనకు ముందు భద్రాచలం రెవిన్యూ డివిజన్ ను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో కలపాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మోదీ సర్కార్ ను డిమాండ్ చేసారు.

నిరంతరం మన కళ్ల ముందు ఆంధ్రప్రదేశ్ దోపిడీకి గురైతున్నదని , ఇక్కడ అపార ఖనిజ సంపదను దోచుకు పోతున్నారని , పాలకుల అవినీతి సొంత ప్రయోజనాలకు ఆంధ్ర రాష్ట్రాన్ని గుల్ల చేస్తున్నారని , రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వ పెద్దలే చేతులెత్తెస్తు దోపిడీకి రాజమార్గం చేస్తున్నారని ,
జై ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఆనాడే రాష్ట్ర విభజన జరిగి ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్ భారతదేశానికే అత్యంత సంపన్న రాష్ట్రంగా చరిత్ర పుటల్లో నిలిచేదని , ఆనాటి జై ఆంధ్ర ఉద్యమ ధీరులు తెన్నిటి విశ్వనాదం , గౌతు లచ్చన్న, కాకని వెంకట రత్నం వంటి నిజాయితీ గల ఉద్యమ వీరులు నేడు ఆంధ్రప్రదేశ్ లో లేకపోవటం ఆంధ్రుల దురదృష్టం అని, తెల్లవారిని గడ గడ లాడించిన మల్లుదొర , గంటందొర , కన్నెగంటి హనుమంతు , అల్లూరి సీతారామరాజు వంటి వీరులను కన్న నేల మన ఆంధ్ర రాష్ట్రం అని, టంగుటూరి ప్రకాశం పంతులు,పొట్టి శ్రీరాములు వంటి ఎందరో త్యాగమూర్తులు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ ప్రతిష్ట కీర్తిని వాడ వాడల ఇనుమడింప చేసారని , జాతీయ స్థాయిలోనే వారి వారి దార్శినికత్వాన్ని చాటుకున్న మల్లాడి సత్యలింగ నాయకర్ , కందుకూరి వీరేశలింగం , స్త్రీ మూర్తులైన డొక్కా సీతమ్మ , కోపనాతి కృష్ణమ్మ వంటి ఎందరో ఆదర్శ ముర్తులు ఈ నెలపై జన్మించి ఆంధ్ర రాష్ట్ర నెల గర్వపడేలా వారి జీవితాలను చాలించారని , అంత గొప్ప రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, నేడు మన రాష్ట్రాన్ని వలసదారులు పాలిస్తున్నారని , మన నేల విలువ వలస దారులకు తెలియటం లేదని , హక్కుల కోసం, ఆత్మభిమానం , ఆత్మగౌరవం కోసం ఉద్యమస్తున్న ఆంధ్రులను వేధింపులకు గురించేస్తున్నారని, యువతను భయానికి , స్వార్ధనికి పాలకులు బానిసలుగా మారుస్తున్నారని,
గతించిన మన ఉద్యమ వీరులను,నాటి పౌరుష త్యాగాలను స్మరించుకుంటు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన గురుతర భాధ్యత నేడు ప్రతి ఆంధ్రుడు పై వుందని భావించాలని , సేవ్ ఆంధ్రప్రదేశ్,
జై ఆంధ్రప్రదేశ్ అంటు ప్రతి ఆంధ్రుడి ఇంటి నుండి రాజకీయాలకు అతీతంగా పోలికేక వినిపించాలని ఆయన కోరారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ను వలసనేతలు పాలిస్తున్నారని , హైదరాబాద్ వేదికతో ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది హైదరాబాదిలు మన రాష్ట్ర భవిష్యత్ ను, ఆంధ్రుల శ్రమను దోచుకు పోతున్నారని , స్వచ్ఛమైన ఆంధ్రుల రాజకీయ పార్టిలు మన రాష్ట్రంలో లేకపోవటం మన ఆత్మగౌరవ ప్రతీకకు నష్టం వాటిల్లు తుందని , ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన రాజకీయ పక్షాలుగా చాలామణి అవుతున్న వారు అంత కేసీఆర్ కు బానిసలే నని , ఆంధ్రలో నేడు తొడలు కొడుతున్న సంపన్న వ్యాపార రాజకీయ పార్టీలన్ని కేసీఆర్ కు పోటీ లేకుండా సొంత రాజకీయ వ్యాపారం చేసుకుంటున్నారని , వీరికన్నా శునక చేష్ట రాజకీయాలు బేషుగా ఉంటాయని,చంద్రబాబు, జగన్, పవన్ లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తొడలు చరుచుకుంటు మీసాలు మేలేస్తుంటారని , కేసీఆర్ కు మాత్రం ఎదురు నిలవరని , హైదరాబాద్ లో కాపురాలు చేసుకుంటు విలాస జీవితాలు గడుపు కుంటున్నారని , ఆంధ్రప్రదేశ్ లో నిత్యం ఆశాంతిని రాజేస్తూన్నారని , ఆంధ్రలో రాజకీయాలు సాసిస్తున్న ప్రస్తుత రాజకీయ పార్టిల నేతలకు మన రాష్ట్రం విడిదిల్లు వంటిదని , వీళ్లెవ్వరికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, భద్రత , సంక్షేమం అవసరం లేదని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తున్నావారు అంత బ్రిటిష్ వారి స్వభావం గలవారని అని, ఆంధ్రుల ఖ్యాతి , ఉద్యమ చరిత్రలు, సామాజిక ఆచార సాంప్రదాయలు తెలియని కేసీఆర్ చేసిన , చేస్తున్న వ్యక్తిగత విమర్శలను సైతం ఆంధ్ర వలస పార్టిలు తిప్పికోట్టరని , వరహానికి ఏమి తెలుసును సుగంది వాసన అన్నట్టు కేసీఆర్ కు ఆంధ్రుల చరిత్ర తెలియక పోవటంలో పెద్ద ఆశ్చర్యం లేదని ఆయన పేర్కొన్నారు.

2024 ఎన్నికల ప్రజా తీర్పు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు, హైదరాబాది నేతల దోపిడీకి మాత్రమే జరుగుతాయని , ఆంధ్ర హైదరాబాదిలు కేసీఆర్ కు భయపడుతూ స్వరాష్ట్ర అభిమానాన్ని మరిచిపోతున్నారని , మన వలస పార్టీల నేతలే కేసీఆర్ కు బాంచన్ అంటు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుంటే ఆంధ్ర సెటిలర్స్ పై మరో బీహారి, ఆంధ్ర సెటిలర్ అయిన కేసీఆర్ పెత్తనం చెలాయిస్తున్నారని , సుమారు ఒక లక్షా ఏబై వేల కోట్లు ఉమ్మడి విభజన ఆస్తుల వాటాను ఆంధ్ర పాలకులు ప్రశ్నించి సాధించలేని చేతకాని దద్దమ్మలు మన వలస పాలకులని , ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నిరంతరం బూతులు, దాడులు , దౌర్జన్యాలు , అవినీతి, అక్రమాలతోనే పాలన సాగుతుందని , ప్రతిపక్షం కూడా మేకపోతు గాంబిరంతో కాలయాపన చేయటం తప్ప చిత్తశుద్ధి కనపరచటం లేదని , ఆంధ్రలో అభివృద్ధి లేకపోగా ఉన్న అభివృద్ధిని భయబ్రాంతులకు గురించేస్తు ఆంధ్ర రాష్ట్రం నుండి గేంటెస్తున్నారని, మన రాష్ట్రంలో ఉపాధి అవకాశలు అడగంటి పోయాయాని, యువతకు బ్రతుకు భారమయ్యి చట్ట వ్యతిరేక పనులకు బానిసలుగా మారుతున్నారని , దోపిడీ ని ప్రశ్నించలేని విధంగా యువతను అక్రమ కేసులతో భయబ్రాంతులకు గురించేస్తున్నారని, రాను రాను ఆంధ్ర రాష్ట్ర యువత చేవ లేనట్టుగా మిక్కిలి వృద్దులుగా మారుతున్నారని, అన్ని వనరులు పుష్కలంగ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆకలి దరిద్ర్యంతో అర్దనాదాలు పెడుతుందని , ఆంధ్ర వలస పార్టిలు మన ఆంధ్రులను యాచకులు వలె మారుస్తున్నారని, స్వచ్ఛమైన ఆంధ్రుల పౌరుషం ఎలా ఉంటుందో ఆంధ్ర వ్యాపార రాజకీయ పార్టీలకు తెలియ చేయాల్సిన అవసరం ప్రతి ఆంధ్రుడి భుజస్కందాలపై వుందని ఆయన గుర్తు చేసారు.

విభజన అంశాల ప్రకారం పునర్ విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ లో అమలు జరగటం లేదని , ఈ తరుణంలో విభజనకు చట్టభద్దత లేకుండానే రెండు రాష్ట్రాలుగా వేరు చేసి ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించి రెండు శాసన సభలు అమలు చేయటం రాజ్యాంగ బద్దం అవుతుందా ! విభజన జరగటం అవసరమే అయినప్పటికి విభజన ముసుగులో ఆశాస్త్రీయతను, దగా , మోసాన్ని ప్రోత్సహించటం కేంద్ర ప్రభుత్వానికి తగునా, ఒక్క శ్రీ రామ మందిరాన్ని మాత్రమే తెలంగాణాలో ఉంచి రాములవారి మొత్తం ఆస్తులను ఆంధ్రప్రదేశ్ లో ఉంచి విభజన చేయటం రాజకీయ కుట్రలో భాగం కదా ! విభజన ను అంగీకరిస్తూనే పునర్ విభజన చట్టం పై భారత పార్లమెంట్ లో పునర్ చర్చ ను ప్రారంభించాలని , విభజనకు ముందు భద్రాచలం రెవిన్యూ డివిజన్ మొత్తాన్ని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో కలపాలని , హైదరాబాద్ ఉమ్మడి ఆస్తుల ఆర్ధిక వాటాను తక్షణమే ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఖజానాకు జమచేయాలని, కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తే ప్రజా ఉద్యమం తప్పదని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చిరించారు.

సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ దుడ్డే సురేష్ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ ఎండి హుస్సేన్, వర్ధనపు శరత్ కుమార్,
మార్త ప్రభాకర్,వాడపల్లి జ్యోతిష్, సుంకర వెంకట భాస్కర వెంకట రంగారావు , వల్లి శ్రీనివాసరావు, మాసా అప్పాయమ్మ , బత్తెన వెంకటేశ్వరరావు,బత్తెన జయకృష్ణ, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, వట్టి శ్రీనివాసరావు బసా సోనియా, గుడ్ల పద్మావతి , లంక వీర వెంకట సత్యనారాయణ,మాసా రత్నకుమారి, మాసా లక్ష్మి, నాగూరు అన్నపూర్ణ, అడపా శేషగిరి, మాసా కమల తదితరులు పాల్గొని యున్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular