హ్యాట్రిక్ విజయాన్ని అందించిన హర్యానా ప్రజలకు కృతజ్ఞతలు
నున్నా రవికుమార్
Mbmtelugunews//ఖమ్మం,అక్టోబర్ 08 (ప్రతినిధి మాతంగి సురేష్)పాలేరు నియోజకవర్గం కుసుమంచిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ హర్యానాలో విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాలేరు అసెంబ్లీ అభ్యర్థి నున్నా రవికుమార్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ హర్యానా ప్రజలు మూడో సారి భారతీయ జనతా పార్టీ కి అవకాశం ఇచ్చి డబల్ ఇంజన్ సర్కారు ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకంతో నరేంద్ర మోడీ పై నమ్మకంతో భారతీయ జనతా పార్టీపై నమ్మకంతో ఓట్లు వేసిన హర్యానా రాష్ట్ర ప్రజలకు గెలిసినటువంటి ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు ఎంతో విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ విజయం కోసం పార్టీ కార్యకర్తలు నిబద్ధతతో అహర్నిశలు శ్రమించి విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు కుసుమంచి సెంటర్లో టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడ్డం వెంకటేశ్వర్లు,జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు రవి రాథోడ్,జిల్లా నాయకులు బెల్లం మురళి,దాసరి వెంకటేశ్వర్లు,మండల ప్రధాన కార్యదర్శి నరేష్,S వెంకన్న,బద్దం వెంకట్ రెడ్డి,గుండా ఉపేందర్ రెడ్డి,భద్రయ్య,పిట్టల వేణు,గుండా విజయ్ పాల్ రెడ్డి,దాసరి దుర్గయ్య,కీర్తి,ప్రభాకర్,సిత్తారి,శేఖర్ మండల నాయకులు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ (9666358480) కి పంపించగలరు