100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేయడం పట్టణానికి గర్వకారణం……
:ప్రజల్లో దేశభక్తి పెంపొందించేందుకు ఐవీవో చేస్తున్న కృషి అభినందనీయం:ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి……
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 15 ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణంలో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేయడం కోదాడ పట్టణంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.గురువారం భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ వేటరణ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించి మాట్లాడారు.దేశ సరిహద్దుల్లో సేవలందించి రిటైర్మెంట్ అనంతరం దేశభక్తి కలిగిన మరికొందరితో కలిసి ఐవివో ఏర్పాటు చేసి ప్రజల్లో దేశభక్తి పెంపొందించేందుకు ఆర్గనైజేషన్ సభ్యులు చేస్తున్న కృషిని వారు ప్రత్యేకంగా అభినందించారు.దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారని వారి త్యాగాలకు గుర్తుగా ప్రజలందరిలో దేశభక్తి పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలోఐ వివో రాష్ట్ర అధ్యక్షులు ఉజ్జిని రవీందర్ రావు,జిల్లా అధ్యక్షులు, స్టేట్ కోఆర్డినేటర్ గుండా మధుసూదన్ రావు,కోదాడ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల రమేష్,వైస్ చైర్మన్ కందుల. కోటేశ్వరరావు,పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,మాజీ సర్పంచ్ పారా సీతయ్య,పాట్రన్స్ గుండపునేని నాగేశ్వరరావు,జగనీ ప్రసాద్,పిఆర్ఓ షేకు రమేష్,వైస్ ప్రెసిడెంట్ నెమ్మది రామారావు,రాబట్,జిల్లా కోఆర్డినేటర్ గోవింద నవీన్,వై రెడ్డి, వెంకన్న,దుర్గయ్య,కత్తి బాగాత్,పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.