పుట్టబోయే ది ఆడబిడ్డ!మగ బిడ్డ! అని అడగవద్దు అది చట్టరీత్యా నేరం:జిల్లా వైద్యాధికారి కోటాచలం
:కోదాడ పట్టణంలో విజయ హాస్పిటల్ ను సీజ్ చేసిన జిల్లా వైద్యాధికారి కోటాచలం.
కోదాడ,జూన్ 29(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:చివ్వేంల మండలం ఎంజి నగర్ తండాకు చెందిన రత్నావత్ హరిసింగ్ నాయక్ కి డోర్నకల్ ప్రాంతానికి చెందిన సుహాసిని తో 2019లో వివాహం జరిగింది.తొలి మలి సంతానాలలో ఇద్దరూ అమ్మాయిలు కావడంతో హరి సింగ్ నాయక్ సుహాసినికి అబార్షన్ చేయించాలని తలంచాడు.దీనితో హుజూర్ నగర్ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు అక్కడ హరిసింగ్ నాయక్ కి అక్కలు ,బావలు,మరికొందరు బంధువులు ఉన్నట్లు తెలిసింది.దీనితో వారు కోదాడలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లింగ నిర్ధారణ చేసిన అనంతరం హుజూర్ నగర్ కమల ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి అబార్షన్ కి ప్లాన్ చేశారు.మృతురాలు ఏడు నెలల గర్భవతి కావడంతో వైద్యం వికటించి మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వారు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆసుపత్రిలో చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది దీనితో సువాసిని మృతి చెందింది.కోదాడ పట్టణంలోని ప్రయివేటు విజయ హాస్పిటల్ ను సీజ్ చేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.

జిల్లా వైద్యాధికారి కోటాచలం తెలిపిన వివరాల ప్రకారం సుహాసిని మృతి ఘటనపై కోదాడ పట్టణంలోని విజయ హాస్పిటల్ లో స్కానింగ్ తీసినట్లు గా గుర్తించి హాస్పిటల్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని హాస్పిటల్ను సీజ్ చేసినట్లు తెలిపారు.సుహాసిని మృతిపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని పలు హాస్పిటల్ ని సీజ్ చేస్తున్నట్లు తెలిపినారు.జిల్లాలోని హుజూర్ నగర్ పట్టణంలోని కమల హాస్పిటల్, మఠంపల్లి లోని నాగేందర్ హాస్పిటల్ లు సీజ్ చేసినట్లు తెలిపారు.కోదాడ పట్టణంలో విజయ హాస్పిటల్ లో పని చేస్తున్న ఇద్దరు సీనియర్ కాంపౌండర్ లు అబార్షన్ చేసినట్లు గుర్తించామన్నారు.విజయ హాస్పిటల్ లో అబార్షన్ చేయడానికి బేరం కుదరకపోవడంతో హుజూర్ నగర్ లోని కమల హాస్పిటల్ కి బాధితులు తీసుకువెళ్లారు. అక్కడనుండి మఠంపల్లి లో ఉన్న నాగేందర్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది వీరు అంతా కలిసి హుజూర్ నగర్ లోని మామిడి తోటలో అబార్షన్ చేసినట్లు సుహాసిని భర్త,బంధువులు తెలిపినారని అన్నారు.

ఇద్దరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అబార్షన్ చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు.ఇద్దరు కంపౌడర్ల ను పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు.గర్భధారణ పూర్వం మరియు గర్భస్థ పిండలింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టం 1994 ప్రకారం గర్భస్థ శిశువు యొక్క లింగ నిర్ధారణ పరీక్ష లు చేసిన వారికి చేయించుకున్న వారికి అందుకు ప్రోత్సహించిన వారికి చట్ట ప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 10,000 జరిమానా విధించబడును అని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ నిరంజన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.