14 ఏళ్ల తర్వాత ఇక్కడకు వచ్చాను..
- ఆరెంజ్’ రోజులు గుర్తు చేసుకున్న రామ్ చరణ్
Mbmtelugunews//సినిమా, ఆగష్టు 18:ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరుగుతోన్న ‘ది
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’కు గౌరవ అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యారు.భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలకుగాను ‘ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్’గా అంతర్జాతీయ వేదికపై అవార్డు అందు కున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఆరెంజ్’ రోజులను గుర్తు చేసుకున్నారు.”14 ఏళ్ల క్రితం ‘ఆరెంజ్’ సినిమా కోసం ఆస్ట్రేలియాలోని ఈ ప్రదేశానికి వచ్చాను.అది నా మూడో చిత్రం.30 రోజులు చిత్రీకరణ ఇక్కడే జరిగింది. షూటింగ్ పూర్తయి భారత్కు వెళ్లే సమయంలో భావోద్వేగానికి గురయ్యాను.ఇక్కడి ప్రజల ప్రేమను, ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను.అప్పటి కంటేఇప్పుడు ఎక్కువ మంది ఇండియన్స్ ఇక్కడ కనిపిస్తున్నారు.నా హోం టౌన్ కు వచ్చినట్లు అనిపిస్తోంది.మీ అందరినీ చూస్తుంటే ఆనందంగా ఉంది.భారతీయ చిత్రపరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది.మీ అందరి వల్లే ఇది సాధ్యమైంది.ఈ ఈవెంట్ ఎప్పటికీ ప్రత్యేకమే’ అని చెప్పారు.ఆస్ట్రేలియాలో మన జాతీయ జెండాను ఎగురవేసిన రామ్ చరణ్.అక్కడ అభిమానులతో కలిసి ఫొటోలు దిగారు.వాళ్లతో కలిసి సరదాగా సమయాన్ని గడిపారు.ప్రస్తుతం ఈ హీరో ‘గేమ్ ఛేంజర్’ తో బిజీగా ఉన్నారు.శంకర్ దర్శకత్వంలో ఇది రానుంది.పొలిటికల్,యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ ఫుల్
కథాంశంతో సిద్ధమవుతోంది.ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. డిసెంబర్ లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.