ఉన్నత విద్యా మండలి కమిషనర్ దేవసేన తో కెఆర్ఆర్ ప్రిన్సిపాల్,అధ్యాపకులు
కోదాడ,జులై 16(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణ పరిథిలోనే కెఆర్ఆర్ ప్రభుత్య ఆర్ట్స్& సైన్స్ కళాశాలకు ఇటీవల అటానమస్ (స్వయంప్రతిపత్తి) లభించిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్ నాగు తమ అధ్యాపక బృందంతో కలిసి తెలంగాణ రాష్ట్ర కళాంశాల విద్యాకమిషనర్ దేవసేన ని హైదరాబాదులోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎమ్ నాగుని కమిషనర్ అభినందించి సత్కరించారు.కమిషనర్ కార్యాలయ సిబ్బంది ఆర్జేడీలు యాదగిరి,రాజేందర్ సింగ్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్,ఆర్జేడీలు కళాశాల ప్రిన్సిపల్ ని,అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బందినకి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్ నాగు కళాశాల ప్రహరీ గోడ కోసం రాతపూర్వకంగా వినతి పత్రం కమిషనర్ కి సమర్పించారు.

వెంటనే కమిషనర్ మేడం స్పందించి కోదాడ పరిధిలోని వివిధ పరిశ్రమలనుండి కార్పోరేట్ సామాజిక బాధ్యత నిధి (సిఎస్ఆర్ ఫండ్)నుండి వారి యొక్క లెటర్ హెడ్ లో పరిశ్రమల నిర్వాహకులకు తెలియజేసి కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరీ నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు.అదేవిధంగా అటానమస్ రావడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాలకు అటానమస్ రావడం వల్ల జరిగే ప్రయోజనాల గురించి ప్రిన్సిపాల్ ఎమ్ నాగు మాట్లాడుతూ అటానమస్ వలన కళాశాల మౌలిక వసతులు గ్రంథాలయం,జిమ్నజియం,2000 మంది కూర్చునే ఆడిటోరియం,12 డిజిటల్ తరగతులు,ప్రయోగశాలలో ఉన్నాయని అటానమస్ వల్ల నిధులు,కొత్త కోర్సులు,సిబ్బంది,టీచింగ్ ఫ్యాకల్టీ పెరుగుతాయని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.