18న సూర్యాపేట పోస్ట్ ఆఫీసులో ఇంటర్వ్యూలు
సూర్యాపేట,జులై 10 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తపాలా శాఖలో కమిషన్ ప్రాతిపదికన పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 18న సూర్యాపేట పోస్ట్ ఆఫీస్లో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సూర్యాపేట డివిజన్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ జి.సైదులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సూర్యాపేట డివిజన్లోని 347 పోస్ట్ ఆఫీసులు పరిధిలో 18 ఏళ్లు నిండి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.