Wednesday, February 25, 2026
[t4b-ticker]

22వ వార్డులో ముమ్మరంగా కాలువల పూడికతీత పనులు…..

22వ వార్డులో ముమ్మరంగా కాలువల పూడికతీత పనులు…..

:వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు……

Mbmtelugunews//​కోదాడ, ఫిబ్రవరి 25(ప్రతినిధి మాతంగి సురేష్):పట్టణంలోని 22వ వార్డులో వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు వీలుగా మురుగు కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, పూడికను తొలగించే పనులను బుధవారం ముమ్మరంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు (కుసుమ బాబు), స్థానిక కౌన్సిలర్ తూనం కృష్ణ సమక్షంలో ప్రోక్లైన్ సహాయంతో కాలువలను శుభ్రం చేయించారు. వర్షపు నీటితో స్థానికంగా నివసించే వారికి ఇబ్బందులు కలగకుండా పనులను చేపట్టినట్లు వారు తెలిపారు.

కాలువల్లో నీరు నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని వార్డు ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కౌన్సిలర్ యలమందల నరసయ్య, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వీరారెడ్డి, మధు, హనుమంతరావు, ఉస్మాన్, పనింద్ర, సైదులు, దేవమణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular