కోదాడ,జులై 29(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:ఈ నెల 31న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో సిపిఎస్ రద్దు గురించి చర్చించి, సానుకూల నిర్ణయం ప్రకటించాలని టి ఎస్ సి పి ఎస్ ఇ యూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు శనివారం నాడు కోదాడలో పత్రికా ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఆర్థిక సామాజిక భద్రత, గ్యారెంటీ లేని సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ అమలు చేయాలని రాష్ట్రంలో 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ కుటుంబాలు గత 7 సంవత్సరాల నుండి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో అనేక పోరాట ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వాన్నీ కోరుతున్నారు. నెల 16 నుండి 31 వరకు టి ఎస్ సి పి ఎస్ ఇ యూ సారధ్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాల లో పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర దిగ్విజయంగా నిర్వహించబడుతున్నది. కొద్ది నెలలలో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వమే సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేయాల్సిందే నని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వివిధ దశలలో పోరాట ఉద్యమాల ద్వారా డిమాండ్ చేస్తున్నా యి. ఉద్యోగుల స్నేహపూరిత ప్రభుత్వం అని చెప్పుకునే ,ధనిక రాష్ట్రంలో ఎన్నికలకు ముందే సిపిఎస్ ని రద్దుచేసి దక్షిణ భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఆదర్శంగా నిలవాలని, తుదనుగుణంగా ఈనెల 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకొని ప్రకటించాలని కోరారు.
31న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో “సిపిఎస్ రద్దు పైన సానుకూల నిర్ణయం ప్రకటించాలి
RELATED ARTICLES