కోదాడ,ఆగష్టు 04(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీరంగపురం అంగన్ వాడి కేంద్రం 1,2, మరియు 3 కేంద్రాల పరిధిలో గల గర్భిణీలు,బాలింతలు మరియు గ్రామం లోని మహిళలు తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు ఈ వారోత్సవాలకు ముఖ్య అతిథులుగా 5,6 వార్డుల కౌన్సిలర్లు కందుల చంద్రశేఖర్ కందుల కోటేశ్వరరావు పాల్గొని తల్లి పాల విశిష్టత గురించి వారికి వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు,బాలింతలు పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. పుట్టిన ప్రతి పాపకు ఆరు నెలల వరకు తల్లిపాలను తాగించాలన్నారు. దీని వలన పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించవచ్చన్నారు.సెక్టార్ సూపర్ వైజర్ సూర్యకళ,హెడ్ మాస్టర్ మరియు అంగన్వాడీ కేంద్రం నాగమణి,చంద్రకళ,విజయలక్ష్మి,టీచర్స్,ఆశా వర్కర్స్,హెల్పర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
32వ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
RELATED ARTICLES