48 గంటల్లో ఖాళీ చేయండి
Mbmtelugunews//హైదరాబాద్,ఏప్రిల్ 26:
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది.పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. 48 గంటల్లో ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.
అయితే మానవతా దృక్పథంతో వైద్య, దౌత్య మరియు దీర్ఘకాలిక వర్గాలకు కొంత మినహా యించింది. తాజాగా వారికి కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈనెల 29మంగళవారం వరకు మాత్రమే అన్ని రకాల వీసా చెల్లుబాటు అవుతోందని.. అనంతరం వీసా పని చేయదని.. తక్షణమే అన్ని రకాల వీసాలు రద్దు చేయబడిన కారణాన పాకిస్థానీయులు వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది.
ఈ నెల 29 తర్వాత వీసాలు పని చేయవని ఢిల్లీ ప్రభుత్వం కూడా ప్రకటిం చింది. ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక పాకిస్థానీయులకు కొత్త వీసాలు జారీ చేయబడ వని.. దయచేసి అధికారిక నోటిఫికేషన్ చదవాలని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.
కేంద్ర నిర్ణయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా రీట్వీట్ చేశారు. 29లోపు వెళ్లకపోతే అవసరమైన చర్యలు ఉంటాయని రేఖా గుప్తా హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
ఇప్పటికే సింధు జలాలు నిలిపివేసింది. అనంతరం వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ-వాఘా సరిహద్దు మూసివేసింది. ఇలా ఒక్కొక్కటిగా కఠిన నిర్ణయాల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇక సరిహద్దుల్లో ఉగ్రవాదలు ఏరివేతను భారత సైన్యం చేపట్టింది.