హుజూర్ నగర్,ఏప్రిల్ 22 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:60 వసంతాల వేడుకలు వారి జీవితంలో వారు సమాజానికి చేసిన సేవలను గుర్తుచేస్తాయని హుజూర్ నగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయవావాణి దేవి అన్నారు.సోమవారం హుజూర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మాతంగి ప్రభాకర్ రావు వారి సతీమణి నల్లబండగూడెం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న మాతంగి రత్నకుమారి లకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బృందం 60 వసంతాల వేడుకలను ఏర్పాటు చేసినారు.

ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు,ఉపాధ్యాయ బృందం దంపతులను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.అనంతరం ప్రధానోపాధ్యాయురాలు జయవాణి దేవి మాట్లాడుతూ మాతంగి ప్రభాకర్ రావు మాస్టారు పాఠశాలలో తన యొక్క వృత్తిని బాధ్యతగా నిబద్ధతతో పనిచేసేవారని అన్నారు.తన వృత్తి తో పాటు సమాజంలో ఎంతోమందికి ఎన్నో విధాలుగా తన యొక్క సలహాలు సూచనలు వారికి అందిస్తూ వారికి చేదోడువాదోడుగా సహాయ పడేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ దంపతుల ఇద్దరికీ మా స్కూల్ తరఫున 60 వసంతాల వేడుకలు నిర్వహించడం మాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.మీరు ఇరువురు బావి జీవితాన్ని నూతన ఉత్తేజముతో, ఉత్సాహంతో గడపాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీదేవి,వెంకటేశ్వర్లు,ప్రసాద్,విజయలక్ష్మి,దీనారాణి,శేషగిరి,అస్మామ్ బీన్,శైలజ,అన్వేష్,అరుణారాణి,వసంతరావు,జనార్దన్ రెడ్డి,రవీందర్ రెడ్డి,అశోక్ కుమార్,వసంతరావు,శ్రీకాంత్,శేఖర్,విద్యార్థినీ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు



