69వ రాష్ట్రస్థాయి అండర్–17 క్రికెట్ పోటీలకు షేక్ అర్హన్ ఎంపిక
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 13(ప్రతినిధి మాతంగి సురేష్): స్కూల్ గేమ్ ఫెడరేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13 నుండి 16 వరకు జడ్చర్ల వేదికగా నిర్వహించబడుతున్న 69వ రాష్ట్రస్థాయి అండర్–17 క్రికెట్ పోటీలలో పాల్గొనే ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు కోదాడ క్రికెట్ అకాడమీ కి చెందిన ప్రతిభావంతుడైన క్రీడాకారుడు షేక్ అర్హన్ ఎంపికైనట్లు కోచ్ సిద్ధిఖ్ తెలిపారు. అర్హన్ తన క్రమశిక్షణ, పట్టుదల, కఠిన సాధనతో ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో నియమిత ప్రాక్టీస్ చేస్తూ తన ఆటను మెరుగుపరుచుకుంటున్నాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్‌లో ప్రత్యేక నైపుణ్యం సాధించేందుకు రన్-అప్ కంట్రోల్, లైన్ అండ్ లెంగ్త్, యార్కర్లు, బౌన్సర్లు వంటి బౌలింగ్ మెళుకువలను సాధన చేస్తున్నాడు. అదనంగా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ స్ప్రింట్స్, స్టామినా ట్రైనింగ్, జిమ్ వర్కౌట్స్, ఫీల్డింగ్ డ్రిల్స్ వంటి వ్యాయామాలతో శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకున్నాడు. మ్యాచ్ పరిస్థితులను ఎదుర్కొనే మానసిక ధైర్యం ఆత్మవిశ్వాసం కూడా అలవర్చుకున్నాడు. ఈ విజయానికి అకాడమీ కోచ్ షేక్ అబూబకర్ సిద్దిఖ్ శిక్షణ, మార్గదర్శనం, నిరంతర ప్రోత్సాహం ప్రధాన కారణమని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రస్థాయిలో అర్హన్ ఉత్తమ ప్రదర్శన చేసి జిల్లా, అకాడమీకి మంచి పేరు తీసుకురావాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. తల్లిదండ్రులు అతనిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కోదాడ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సురేష్, మండల విద్యాశాఖ అధికారి మొహమ్మద్ సలీం షరీఫ్,
కోదాడ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఖాజా మియా, తుమ్మల సురేష్, మీరా, డాక్టర్స్ క్రికెట్ జట్టు కోదాడ రాయల్స్ క్రీడాకారులు డాక్టర్ నందకిషోర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ దిలీప్, డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ కార్తీక్, డాక్టర్ వినయ్, డాక్టర్ విజయ్, డాక్టర్ కలాం, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ సాంబ, డాక్టర్ వెంకటేష్, అసోసియేషన్ సభ్యులు నాయిని నాగేశ్వరరావు, జబ్బార్, శ్రీకాంత్, బాలరాజు, బుల్లయ్య, శ్రీను తదితరులు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.



