హుజూర్ నగర్,జూన్ 19(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హరితహారం కార్యక్రమము స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు మరియు ఐదవ వార్డు కౌన్సిలర్ దొంగరి మంగమ్మ లు హాజరై మొక్కలు నాటినారు.ఈ సందర్భంగా జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ నాణ్యమైన విద్య అందుతున్నదని తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరినారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మాతంగి ప్రభాకర్ రావు మరియు ఉపాధ్యాయులు ఉదయశ్రీ,శ్రీనివాస,శ్రీనివాసరెడ్డి,ఉపేందర్,దీనారాణి,శేషగిరి,వసంతరావు,రవీందర్ రెడ్డి,శేఖర్,నాగేశ్వరరావు,శ్రీకాంత్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య – జక్కుల నాగేశ్వరరావు
RELATED ARTICLES