కోదాడ,జూన్ 20(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కోదాడ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించి,విద్యా దినోత్సవ సంబరాల్లో ఉపాధ్యాయులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొని,గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న విద్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ప్రగతి బాటలో ముందుకు సాగుతున్నదని ఆయన అన్నారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ,కొత్తగా గురుకుల పాఠశాలలను నెలకొల్పుతూ,ప్రైవేటు,కార్పొరేట్ విద్యారంగాన్ని తలదన్నేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని ఆయన అన్నారు.నాణ్యమైన విద్యావిధానం,ఇంగ్లిష్ మీడియంలో బోధన,సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం,పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆయన అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధిస్తున్నారని ఆయన అన్నారు.పునాది నుంచి పై కప్పు వరకు సర్కారు బడి బలోపేతం ‘మన ఊరు – మన బడి,మన బస్తీ -మన బడి’ ఆశయం అని ఆయన తెలిపారు.అందరికీ మెరుగైన విద్య అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి నిదర్శనం ఈ పథకం అని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కేసిఆర్ సారధ్యంలో నేడు ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ వచ్చిందన్నారు.ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు వృద్ధిలోకి వచ్చాయి అన్నారు.మన బస్తి -మన బడి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల సుందరీకరణ,మరత్తులు మరియు మౌలిక సదుపాయాలు కలోస్తుందన్నరు.ఈ వేడుకల్లో సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్,విద్యాశాఖ అధికారి సలీం షరీఫ్,స్థానిక ప్రజాప్రతినిధులు చింత కవిత రెడ్డి,చుండూరి వెంకటేశ్వర్లు, పట్టణ కౌన్సిలర్లు,ప్రధానోపాధ్యాయులు,ప్రిన్సిపల్ లు,ఉపాధ్యాయ సంఘాల నాయకులు,ప్రభుత్వ ఉపాధ్యాయులు,ప్రైవేట్ ఉపాధ్యాయులు ,ప్రజలు,నాయకులు,విద్యార్థులు,అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
కెసిఆర్ సారథ్యంలో నేడు ప్రభుత్వం పాఠశాలకు మహర్దశ:ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
RELATED ARTICLES