కోదాడ,జూన్ 21(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక ఎమ్మెస్ విద్యా సంస్థల లో ప్రొఫెసర్ జయ శంకర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెస్ విద్యా సంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి,ఎమ్మెస్ విద్యా సంస్థల సీఈవో ఎస్ఎస్ రావు.ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంర్ అని,తెలుగు,ఉర్దూ,హిందీ,ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం కలిగి, తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన ఆశయాలను ఆచరణలో ఉంచాలని అన్నారు.ఈ కార్యక్రమం లో ఎమ్మెస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తోట రంగారావు, కళాశాల అధ్యాపకులు ప్రసాద్,జి యస్ యన్ రెడ్డి,విజయ భాస్కర్, నాగిరెడ్డి ,ఆఫీస్ సిబ్బంది సీతా రామయ్య,పందిరి ఫౌండేషన్ సభ్యులు బారి వెంకన్న,ఎల్ హెచ్ పిఎస్ నాయకులు బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు
RELATED ARTICLES