కోదాడ,జూన్ 22(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:ఓటర్ లిస్టులో నెలకొన్న అవకతవకలను సవరించి రాబోయే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వరరావు,రాష్ట్ర మాజీ కార్యదర్శి కాపుగల్లు పిఎసిఎస్ చైర్మన్ నంబూరి సూర్యం లు అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పట్టణా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ శ్రీనివాస్ శర్మకు తెదేపా శ్రేణులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయిన వారి పేర్లను ఓటర్ జాబితా నుండి తొలగించడంతోపాటు పట్టణాల్లో ఉంటూ గ్రామాల్లో ఓటు ఉన్న వారికి గ్రామాల్లో ఉంటూ పట్టణాల్లో ఓటు ఉన్న వారిని గుర్తించి జాబితా నుండి తొలగించే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు.బూత్ స్థాయిలో బిఎల్ఓ లను ఇంటింటికి సర్వే చేయించి ఒక పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఉప్పుగండ్ల సరోజ,మాజీ రైతు సంఘం అధ్యక్షుడు ఉన్న హనుమంతరావు,రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ ఆర్గనైజర్ సెక్రెటరీ నాగరాజు,అనంతగిరి మండల ఉపాధ్యక్షుడు సోమపంగు సమదేవ్,కోదాడ రేవంత్ రెడ్డి, టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు పుల్లారావు,ముండ్రారవి,సజ్జారామెహన్ రావు,కొత్తారాంబాబు,బొర్రా హనుమంతరావు,వనపర్తి నాగేశ్వరావు,షేక్ బాబా,రమేష్,మన్నె శ్రీరామ్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు……
ఓటర్ జాబితాలో అవకతవకలను సరిచేయాలి.:రాబోయే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి:కోదాడపట్టణతెగుదేశంపార్టీ అద్యక్షుడు ఉప్పుగండ్ల శ్రీనివాసరావు.
RELATED ARTICLES