కోదాడ,జూన్ 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అనంతగిరి మండల కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో అనంతగిరి మండలం బిఎస్పి అధ్యక్షుడు నూకల గోపాలస్వామి యాదవ్ పాల్గొని మాట్లాడుతూ గత సంవత్సరం సాగర్ ఎడమ కాలువకు పడిన గండి వల్ల హాలియా ప్రాంత రైతులు చాలా వరకు నష్టపోయారని ఈ సంవత్సరం కూడా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బలహీనంగా ఉన్న కాల్వ కట్టలను కాల్వ లైనింగ్ ను వెంటనే పటిష్ట పరిచి,జూలై మొదటి వారం కల్లా ఎడమ కాలువ పరిధిలోని రైతులకు నీరు అందించాలని,వర్షాలు ప్రారంభమై ప్రాజెక్టు నిండే సమయానికి కాల్వకు మరమ్మత్తులు చేస్తే ఏం ప్రయోజనం అని వారు ఆరోపించారు.అదేవిధంగా రైతు సౌభాగ్యమే తమ ధ్యేయమంటూ ప్రభుత్వాలు జోలపాటలతో రైతుల్ని మభ్యపెడుతున్నాయి అని,అలుపెరుగని శ్రామికుల్లా రైతులు బ్రతుకు పోరు చేస్తూ,జాతికి ఆహారాన్ని అందిస్తుంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వారిని బిచ్చగాళ్ళలా చేస్తున్నాయి అని,ప్రభుత్వం అందించే రాయితీలు రుణమాఫీలు రైతుబంధులు స్వయంగా వ్యవసాయం చేయకుండా ఉన్న భూకామందులకే లభిస్తున్నాయని ప్రభుత్వానికి కూడా తెలుసు,కానీ కౌలు రైతుల సమస్యల పట్ల ఏ మాత్రం ప్రభుత్వం దృష్టి సారించకపోవడం శోచనీయమని వారు వాపోయా.ఈ కార్యక్రమంలో మండల నాయకులు కరిష ఉపేందర్,రఘు,సతీష్,వినోద్,వెంకటేష్,అంజలి తదితరులు పాల్గొన్నారు.
సాగర్ ఎడమ కాలువ కట్ట మరమ్మతులు పూర్తిచేసి తక్షణమే సాగునీరు విడుదల చేయాలి
RELATED ARTICLES