కోదాడ,జూన్ 25(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:TPCC ఉపాధ్యక్షురాలు,కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కోదాడ మండలం యర్రారం లో స్వయం వ్యక్త శ్రీ దూళ్ల గుట్ట బాల ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో ఇంత మంచి మహిమగల దేవాలయాన్ని ఏర్పాటు చేయడం కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి సూచికని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ దేవాలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు.ఈ దేవాలయ అభివృద్ధికి అనునిత్యం నా సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రవరం దూలగుట్ట బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
RELATED ARTICLES