కోదాడ,జూన్ 25 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:యువత తాము ఎంచుకున్న క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాల అధిరోహించాలని నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు బొల్లం కళ్యాణ్ అన్నారు.ఆదివారం కోదాడ పట్టణ బాలల ఉన్నత పాఠశాలలో ది కోదాడ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ద్రోధపడతాయని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా క్రీడాకారులకు భోజన వసతి కల్పించిన రంగశెట్టి రంగారావును ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి కౌన్సిలర్లు లంక నిరంజన్ రెడ్డి కాజా భాయ్,షేక్ మదార్,కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నామా నరసింహారావు,సీనియర్ కబడి క్రీడాకారులు షేక్ బాగ్దాద్,దమ్ము శ్రీనివాస్,చిన్న విష్ణువర్ధన్ రావు,చాపల రామారావు,పంది తిరపయ్య,పాముల భాస్కర్,క్రీడాకారులు,వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
యువత క్రీడలలో రాణించాలి నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు బొల్లం కళ్యాణ్
RELATED ARTICLES