సినిమా (mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:యాక్షన్ కింగ్ అర్జున్ నటుడు గానే కాదు.. దర్శకుడిగా నిర్మాతగా రచయితగా తనకంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో తెలుగు తమిళం కన్నడ హిందీ వంటి భాషల్లో చాలా సినిమాలను చేశారు అర్జున్. సినిమా మీద ఉన్న ఫ్యాషన్ తో తన కూతురు ఐశ్వర్య ని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు. 2013 లో వచ్చిన ‘పట్టతు యానయ్’ అనే తమిళ సినిమాతో ఐశ్వర్య సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ప్రేమ బరహ కన్నడ సినిమా కూడా చేశారు.ప్రస్తుతం తండ్రి అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఐశ్వర్య. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సెలవేగంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే ఐశ్వర్య కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొడుతోంది.త్వరలోనే ఐశ్వర్య అర్జును పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. తమిళనాడులో పేరు ఉన్న హాస్యనటుడి కుమారుడుని పెళ్లి చేసుకోబోతున్నారంట. ఐశ్వర్య తమిళ సీనియర్ హాస్య నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారట. వివాహం గురించి వీరిద్దరూ తమ ఇంట్లో వారితో చర్చించారట. ఇరుకు కుటుంబాలు కూడా వీరి పెళ్లికి ఓకే చెప్పాయట. దీంతో త్వరలోనే వీరి వివాహము అత్యంత అంగరంగ వైభవంగా జరగబోతుందని సమాచారం. ఇద్దరి పెళ్లి విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.ఇటు ఉమాపతి కుటుంబం నుంచి కానీ.. అటు అర్జున్ కుటుంబం నుంచి కానీ అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. ఉమాపతి రామయ్య 2017 లో వచ్చిన అదగ పాతుతు మన జనంగలే అనే సినిమాతో పరిశ్రమ లోకి వచ్చారు. తమిళంలో ఇప్పటివరకు నాలుగుకి పైగా సినిమాలను చేశారు. ఈ సినిమాలతో పాటు టీవీ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం దేవదాసు అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ మూవీ షూటింగు శరవేగంగా జరుపుకుంటుంది. అర్జును కూతురు పెళ్లి వార్తలపై అధికారికంగా ప్రకటిస్తే కానీ ఓ క్లారిటీ రానుంది.
త్వరలోనే హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య పెళ్లి..?
RELATED ARTICLES