కోదాడ,జూన్ 26మనం న్యూస్:భారతదేశ రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహరాజ్ అని బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు కందుకూరి ఉపేందర్ అన్నారు.ఛత్రపతి సాహు మహరాజ్ 149వ జయంతి సందర్భంగా బీయస్పీ ఆధ్వర్యంలో కోదాడ టౌన్ లో స్థానిక రంగా థియెటర్ దగ్గర ఆయన చిత్రపటానికి బీయస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్, నియోజకవర్గ కోశాధికారి పాతకోట్ల శ్రీనివాస్, జిల్లా ఈసీ మెంబర్ సాలె చంటి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సామాజికన్యాయం అమలుకు 28 ఏళ్ల వయస్సులోనే తన రాజ్యంలో బ్రాహ్మణేతరులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి,సమాన అవకాశాలకు పునాదులు వేసిన మహనీయులు ఛత్రపతి సాహుమహరాజ్ అని కొనియాడారు.విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి విద్యాసంస్కరణల కమిటీ ఏర్పాటు చేసి,1917లోనే ఉచిత నిర్భంధ విద్య అమలు చేశారని తెలిపారు. హిందూ పిల్లల జోగిని వ్యవస్థను నిరోధించే చట్టం తెచ్చి,వివక్ష అంటరానితనం నిషేధించి కొల్హాపూర్ సంస్థానాన్ని మిగతా రాజ్యాల కంటే అధునాతన,ఆధునిక భావాలతో అభివృద్ధి పథంలో నడిపారని తెలిపారు. కెసిఆర్ పాలనలో సమానత్వానికి విరుద్దంగా కులానికో న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.కెసీఆర్ కులవివక్షను పాటిస్తూ,రాణికుముదినికి ఛీఫ్ సెక్రటరీ పదవి ఇవ్వకుండా కుల వివక్ష చూపారని మండిపడ్డారు. BC జనాభా గణన చేయాలని, రిజర్వేషన్లు పెంచాలని, బీసీ బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. బీసీలకు చట్ట సభల్లో 60-70 సీట్ల వరకు ప్రాతినిధ్యం కల్పించబోయే పార్టీ బీయస్పీ మాత్రమే అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈ.సి మెంబర్ కొండా బీమయ్య గౌడ్, నియోజకవర్గ అధ్యక్షులు కందుకూరి ఉపేందర్,జనరల్ సెక్రటరీ కాంపాటి శ్రావణ్,కోశాధికారి పాతకోట్ల శ్రీనివాస్,కార్యదర్శి కలకొండ భరత్,కోట మన్మధుడు, దైద సురేందర్,జిల్లా ఈసీ మెంబర్ సాలె చంటి,జిల్లా కో కన్వీనర్ వెంపటి నాగమణి,నడిగూడెం మండల అధ్యక్షులు నెలమర్రి శ్యామ్,అనంతగిరి మండల అధ్యక్షులు గోపాలస్వామి యాదవ్,చిలుకూరు మండల అధ్యక్షులు కొండా ఉపేందర్ గౌడ్,మునగాల మండల ప్రధాన కార్యదర్శి దేవరంగుల్ల రామకృష్ణ,బివీఎఫ్ కో కన్వీనర్ ముదిగొండ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహరాజ్ జయంతి వేడుకలు
RELATED ARTICLES