కోదాడ,జూన్ 27(mbmteugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ లో అఖిలభారత రైతు కూలీ సంఘం(ఏఐకెఎంఎస్) ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై కోదాడ మండల తాహసీల్దార్ ఆఫీసులో డిప్యూటీ తాహసీల్దార్ చల్ల శ్రీనివాసరావు కు మెమోరాండం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు పోటు లక్ష్మయ్య పాల్గొని మాట్లాడుతూ ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమైందని ప్రభుత్వం రైతాంగానికి విత్తనాలు,ఎరువులు,రుణాలు అందుబాటులో ఉంచాలని,నకిలీ విత్తనాలు,ఎరువులను అరికట్టాలని,రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి లక్షలోపు రుణాలను వాటికి అయినటువంటి వడ్డీని కూడా ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని,తిరిగి రైతాంగానికి కొత్త రుణాలు ఇవ్వాలన్నారు.సన్నా చిన్నకారు రైతాంగానికి వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందించాలని,సాగర్ ఎడమ కాలువపై ఉన్న లిఫ్టులను ప్రభుత్వమే నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం పంటల ధరలపై కేంద్రానికి సిఫార్సు చేసిన ప్రకారం మద్దతు ధరలను ప్రకటించాలని తాహసిల్దార్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలియజేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతుకూలీ సంఘం డివిజన్ అధ్యక్షులు పారేల్లి నాగయ్య, డివిజన్ కార్యదర్శి మేకల కనకారావు,జిల్లా నాయకులు వల్లబుదాసు రాజు,వి.నరసింహరావు,ఉదయగిరి,ధారావత్ సైదా,తమ్మిశెట్టి వెంకన్న, మద్దెల జానయ్య,కోడి సైదులు,అనంతరామయ్య తదితరులు పాల్గొన్నారు
రైతాంగ సమస్యలను పరిష్కరించాలి!
RELATED ARTICLES