హైదరాబాద్,జూన్ 29 (mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:ప్రతినిధి మాతంగి సురేష్:ప్రముఖ గాయకుడు సాయిచంద్ పార్థివ దేహానికి వనస్థలిపురం శ్మశానవాటిక వద్ద బీఎస్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు బీఎస్పి నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కుల్కచర్లలో స్వేరో జ్ఞాన యాత్ర ముగింపు సభలో సాయిచంద్,నేను రిటైర్ అయిన తరువాత ఇద్దరం కలిసి పనిచేద్దమన్నడు.అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని తెద్దమన్నడు.అది తీరని కల లాగానే మిగిలిపోయింది అని తెలిపాడు.తరువాత నేను వెంటనే ఐపిఎస్ నుండి స్వచ్ఛందంగా వైదొలిగి బీఎస్పిలో చేరిన.సాయిచందు టిఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నడు.బీ ఫారం కూడా తెచ్చుకున్నడు.కానీ అగ్రవర్ణ భూస్వాముల కుట్రలకు బలైండు. తద్వారా సాయిచందు స్థానంలో కూచకుళ్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యిండు.సాయిచందును వెన్నుపోటు పొడిచెందవరో తెలంగాణ అంతటికీ తెలుసు..నేను చెప్పను అని తెలిపాడు.నేను ఆనాడే సాయితో మాట్లాడి ఆత్మగౌరవ చిరునామా ఐన బీఎస్పికి రమ్మని అడిగిన,తను కొంతకాలం తర్వాత వస్తా అని అన్నాడు.మన ఏలికలు ఏమనుకున్నారో,తర్వాత ఆయనను ప్రాధాన్యత లేని గిడ్డంగుల కార్పోరేషన్ కు ఛైర్మన్ గా నియమించిండ్రు అని అన్నారు.నాగర్ కర్నూలులో కూడా హైదరాబాదు యశోద లాగా వైద్య సదుపాయాలుండింటే సాయిచందు సజీవంగా ఉండి మళ్లీ తన గళంతో మనల్ని సమ సమాజం వైపు నడిపించేవాడేమో! ఇది ఇప్పటి పాలకుల హయాంలో జరుగుతుందనుకోవడం కేవలం భ్రమనే.ఎంతో మంది సినీ ప్రముఖులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి,తన జీవితాన్ని పాటకు అంకితం చేసి,తెలంగాణ ఉద్యమానికి,అంబేద్కర్ భావజాలానికి ఊపిరూదిన ప్రజా గాయకుడు సాయిచందుకు కూడా అదే గౌరవం ఇవ్వాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టం. అహంకారపూరితం అని తెలిపారు.
గూఢ అంజయ్యకి,సాయన్నకి ఇదే అవమానం జరిగింది.ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో లో ఉండి వివిధ పదవుల్లో ఇరుక్కపోయిన బహుజన బిడ్డలు దీనిని గుర్తించండి.అప్రమత్తంగా ఉండండి. గొంతెత్తండి.కరివేపాకులు కాకండి. కనీసం సాయిచంద్ కుటుంబంలో ఒకరికి అయినా ఎమ్మెల్సీ (MLC) పదవి ఇవ్వాలని డిమాండ్ చేయండి.ఇది రాజకీయం కాదు. నిప్పు లాగా రాజుకొనే నిఖార్సైన నిజం అని అన్నారు.
సాయిచంద్ అంతిమయాత్రలో పాల్గొన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RELATED ARTICLES