కోదాడ,జూన్ 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అన్ని దానాల కన్నా గొప్పదనం రక్తదానం ఈ రక్తదానం వలన ఒకరి ప్రాణాలను కాపాడిన వారు అవుతారని ఎంబిఎం బ్లడ్ డోనర్స్ గ్రూప్ సభ్యులు తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర బండపాలెం గ్రామానికి చెందిన మాతంగి కాంతమ్మ కి ఎమర్జెన్సీ ఆపరేషన్ నిమిత్తం అత్యవసరంగా ఏ పాజిటివ్ బ్లడ్ అవసరమని డాక్టర్లు తెలపడంతో ఎంబిఎం బ్లడ్ డోనర్స్ గ్రూపు సభ్యులైన కర్మన్ ఘాట్ హైదరాబాదుకు చెందిన కె సాగర్,జె క్రాంతి కుమార్ లు వారికి బ్లడ్ ఇచ్చినారు.ఈ సందర్భంగా ఎంబిఎం ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ ఎంబీఎం బ్లడ్ డోనర్స్ గ్రూపు ద్వారా ఎంతో మందికి రక్తం అందించడం జరిగిందని తెలిపారు.ఈ రక్తాన్ని డైరెక్ట్ గా పేషెంట్ కి అందించడం జరుగుతుందని తెలిపారు.రాబోయే రోజులలో ఈ ట్రస్టు ద్వారా ఎంతోమందికి రక్తాన్ని అందించి ప్రాణదాతలుగా నిలుస్తామని తెలిపారు. ఈ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంబిఎం బ్లడ్ డోనర్స్ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అన్ని దానాల కన్నా గొప్ప దానం రక్తదానం:ఎంబీఎం ట్రస్ట్
RELATED ARTICLES