భద్రాద్రి,జులై 01(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారత్ రాష్ట్ర సమితి (భారాస)కు ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య భారాసకు రాజీనామా చేశారు.కనకయ్యతో పాటు ఆయన అనుచరులు కూడా భారాసకు రాజీనామా సమర్పించారు.ఇల్లందు నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో ఒక జడ్పీటీసీ, 56 మంది సర్పంచులు,26 మంది ఎంపీటీసీలు భారాసకు రాజీనామాలు చేశారు.అనంతరం ఇల్లందు జడ్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కనకయ్య మాట్లాడుతూ.. జూలై 2వ తేదీన ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఈ సభకు ఇల్లందు నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి వేలాదిగా ప్రజలు హాజరవుతారని వెల్లడించారు.కోరం కనకయ్య గత కొంత కాలంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో రెడ్డితో సన్నిహితంగా ఉంటున్నారని స్థానిక భారాస నేతలు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జడ్పీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, తనను రాజీనామా కోరడం కాదని.. అవిశ్వాసం పెట్టండంటూ అదే స్థాయిలో కనకయ్య సైతం సవాల్ విసురుతూ వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో జడ్పీ ఛైర్మన్ పదవికి కాకుండా కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు కోరం కనకయ్య ప్రకటించారు.
భద్రాద్రి జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య భారాసకు రాజీనామా
RELATED ARTICLES