కోదాడ,జులై 07(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పోలంపల్లి సుధాకర్ గౌడ్ కు నియామక పత్రం అందజేస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. శుక్రవారం నాడు హైదరాబాదులోని బీసీ భవన్ లో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పోలంపల్లి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు నిరుద్యోగుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.నా నియామకానికి సహకరించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లెపల్లి అంజి,బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గాలి శ్రీనివాస్ నాయుడుకు,బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్యకు,బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి భాష్యం వంశీకీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మునగాల మండలానికి చెందిన పోలంపల్లి సుధాకర్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడి గా నియామకం
RELATED ARTICLES



