కోదాడ,జులై 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ముదిరాజ్ సంఘం నాయకులు గాదె మధు ఆకస్మిక మరణం తీర్చలేనిదని,మధు కుమార్తె జాతీయ కబడ్డీ క్రీడాకారిణి సంజన కి తమ సహాయ సహకారాలు అందిస్తామని భారత రాష్ట్ర సమితి కోదాడ నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి అన్నారు.ఆదివారం అనంతగిరి మండల పరిధిలోని రాఘవపురం గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు గాదె మధు ఇటీవల గుండెపోటుతో మరణించగా వారి కుటుంబ సభ్యులను కోదాడ నియోజకవర్గ ముదిరాజ్ సంఘ నాయకులతో కలిసి పరామర్శించి,వారికి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా గాదే మధు కూతురు జాతీయస్థాయిలో కబడ్డీ క్రీడా కారినిగా రాణిస్తుండడంతో తనకు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి తమ సహాయ సహకారాలు అందించేందుకు తనవంతు కృషి ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు.గాదె మధు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో అనంతగిరి జడ్పిటిసి కొణతం ఉమా శ్రీనివాస్ రెడ్డి,కోదాడ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం నాయకులు భాషా బోయిన భాస్కర్,చిలక రమేష్,మూసి శ్రీనివాస్,సారగాండ్ల సత్తయ్య, ముసి మట్టయ్య, టి రామయ్య,మల్లయ్య,వేముల పుల్లయ్య,ధనుంజయ,రామారావు,చాపల శ్రీను,రాఘవాపురం ముదిరాజ్ సంఘ నాయకులు గుల్లపల్లి రామారావు,శీలం నాగేంద్రబాబు,గాదే రామారావు,గాదె రమేష్ వెంకన్న, గాదె పెద్ద వెంకన్న,రెడ్డి బోయిన ఉపేందర్ తదితరులు పరామర్శించినారు.
జాతీయ కబడ్డీ క్రీడాకారిణి గాదే సంజన కు అండగా ఉంటాం.:ముదిరాజ్ సంఘ నాయకులు గాదె మధు కుటుంబాన్ని పరామర్శించి,ఆర్థిక సహాయం అందజేసిన శశిధర్ రెడ్డి
RELATED ARTICLES